news | March 19, 2026

“మట్కా” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇచ్చిన వరుణ్ తేజ్!

Published on Aug 23, 2023 4:00 PM IST

మెగా ప్రిన్స్ వారు తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “గాండీవధారి అర్జున” తో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ భారీ చిత్రం సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కగా మంచి బజ్ అయితే దీనిపై నెలకొంది. ఇక ఈ చిత్రం రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని తాను నెక్స్ట్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం “మట్కా” పై రివీల్ చేసాడు.

ఈ చిత్రంలో అయితే తాను నాలుగు వేరియేషన్స్ లో కనిపిస్తాను అని తెలిపాడు. ఒకో పర్టిక్యులర్ టైం లో తాను ఒకోలా కనిపిస్తాను అని తాను తెలిపాడు. అలాగే ఈ చిత్రం అంతా కూడా గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతుంది అని దర్శకుడు కరుణ కుమార్ మంచి సబ్జెక్ట్ ని డిజైన్ చేసారని ఎక్కువ భాగం అయితే వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే తెరకెక్కుతుంది అని తాను తెలిపాడు. మొత్తానికి అయితే వరుణ్ తేజ్ మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ పెరిమెంట్ తో రాబోతున్నాడు అని చెప్పాలి.